కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మండలంలోని నదిచాగి, బాపురం గ్రామాల్లో బొలేరో ట్రాలీ వాహనంలో పది మంది దొంగలు పశువులు, మేకలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా... గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కౌతాళం, పెద్ద తుంబలం పోలీసులు దొంగల వాహనాన్ని అనుసరించారు. పోలీసులు వారి వాహనాన్ని అడ్డుకునేందుకు రహదారిపై ద్విచక్ర వాహనాలు, జీపు అడ్డంగా పెట్టినా వాటిని ఢీకొంటూ వెళ్లారు. చివరికి కౌతాళం మండలంలోని లక్ష్మీ నగర్ క్యాంపులో పొలాల మధ్య వాహనాన్ని వదిలి ఆగంతకులు పారిపోయారు. వాహనం ఆధారంగా దొంగలను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కుట్ర ముసుగు తొలగి..హత్యల కోణం వెలుగులోకి