కర్నూలు జిల్లా నందికొట్కూరులో రష్యన్ భక్తులు సందడి చేశారు. పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్ని సందర్శించిన భక్తులు.. హరినామ సంకీర్తనలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పాండు రంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలతో తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. స్థానిక చిన్నారులు, యువతులు వీరితో పాటు నృత్యాలు చేస్తూ గీతాలు ఆలపించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: