.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా కల్లూరు, కోడుమూరులో అప్పులు బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. 7 లక్షలు చెల్లించి సిఎం జగన్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబాల పిల్లలను ప్రభుత్వమే చదివించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నేతలు పాల్గొన్నారు
ఇదీ చదవండి:అనుమతులు ఇచ్చిన చోట.. పరిశ్రమలు ఏర్పాటు చేశారా? లేదా?