కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో కిరాణా దుకాణాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8,850 కిలోల సారా బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దుకాణ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి..