ETV Bharat / state

ప్రశ్నించినందుకే అర్చకులను కొట్టారు..! - Temple chairman attack in omkaram temple

Temple chairman attack on Priests in kurnool
ఓంకారం పుణ్యక్షేత్రంలో అర్చకులపై ఆలయ ఛైర్మన్ దాడి
author img

By

Published : Nov 30, 2020, 1:40 PM IST

Updated : Nov 30, 2020, 5:35 PM IST

13:36 November 30

ఉచిత దర్శనానికి టికెట్ రుసుము ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు ఆలయ అర్చకులపై ఛైర్మన్‌ దాడి చేశాడు. మరో ఇద్దరితో కలిసి కట్టెతో అర్చకులను చితక బాదాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగింది.

ఓంకారం పుణ్యక్షేత్రంలో అర్చకులపై ఆలయ ఛైర్మన్ దాడి

పూజాదికాలు నిర్వహించే అర్చకులపై సాక్షాత్తు ఆలయ ఛైర్మన్‌ దాడి చేసిన ఘటన  కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో ఉచిత దర్శనానికి బదులు టికెట్ రుసుము ఎందుకు వసూలు చేస్తున్నారని అర్చకులు సుధాకర్, చక్రపాణి ప్రశ్నించారు. మీకు సంబంధం లేని వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహించిన ఆలయ ఛైర్మన్ ప్రతాప రెడ్డి కట్టెతో వీపుపై చితక బాదారు. దాడి చేసిన వారిలో ఆలయ ఛైర్మన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారన్న అర్చకులు... కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై ఆలయ ఈవో మోహన్‌కు   అర్చకులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి.  ఓ నాయకా..నిధి నీ విధి!

Last Updated : Nov 30, 2020, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.