కర్నూలు జిల్లా తుంగభద్ర నది ఆర్డీఎస్ (RDS) ఆనకట్ట కుడి కాలువ నిర్మాణాన్ని రైతుల కోసం కాకుండా నేతలు దోచుకోవటానికే డీపీఆర్ (DPR) మార్చారని మంత్రాలయం తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ తిక్కారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలో ఆయన సాధన దీక్ష చేపట్టారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలతో పాటు వెనుకబడిన కోసిగి మండలానికి సాగు, తాగునీరు అందించేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం రూ. 1900 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక..కుడి కాలువ ప్రణాళికలు మార్చి కోసిగికి అన్యాయం చేశారని తిక్కా రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ నీటి వాటా విషయమై...తెలంగాణ మంత్రులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీచదవండి
Sadhana Deeksha: కరోనా విపత్తును సీఎం తేలిగ్గా తీసుకున్నారు:చంద్రబాబు