ETV Bharat / state

'తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా కృష్ణానీటిని వినియోగించుకుంటోంది' - కర్నూలు తాజా వార్తలు

తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా కృష్ణా నీటిని వినియోగించుకుంటోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కర్నూలు నగరంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఆందోళన నిర్వహించారు.

ధర్నా చేస్తున్న తెదేపా నేతలు
ధర్నా చేస్తున్న తెదేపా నేతలు
author img

By

Published : Jul 10, 2021, 10:15 PM IST

తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా కృష్ణా నీటిని వినియోగించుకుంటోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కర్నూలు నగరంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఆందోళన నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందని.. దీనివల్ల రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఎడారిగా మారుతాయని.. కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే కేంద్రం కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సుమారు నాలుగు టీఎంసీలు నీరు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా 25 మంది ఎంపీలకు గెలిపిస్తే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని..ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.