విజయవాడలో... తెలుగుదేశం పార్టీ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనాన్ని అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుల ప్రోద్బలంతోనే... సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.
వైశ్య సామాజిక వర్గానికి చెందిన మంత్రి... అదే వర్గానికి చెందిన సమావేశాన్ని అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వెల్లంపల్లికి వ్యతిరేకంగా రాష్ట్రంలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని.. హెచ్చరించారు.
ఇదీ చదవండి: