కర్నూలు జిల్లాలో జరగనున్న తుంగభద్ర పుష్కరాలపై దృష్టి సారించకుండా... తమ నాయకుడు చంద్రబాబును దూషించేందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి కర్నూలుకు వచ్చారా అని.. తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి తుంగభద్ర పుష్కరాలు వచ్చాయన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి... ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయటం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు పుష్కరాలపై దృష్టి సారించి విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఇవీ చదవండి: