వైకాపా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు... న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను అవమానపరిచే విధంగా మాట్లాడారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
న్యాయమూర్తులనే ఇలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో న్యాయం ఎక్కడుందని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు