ETV Bharat / state

'అబ్దుల్ కుటుంబ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే నైతిక బాధ్యత'

author img

By

Published : Nov 8, 2020, 5:10 PM IST

Updated : Nov 8, 2020, 5:26 PM IST

అబ్దుల్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్‌ ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు.

అబ్దుల్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం విచారకరం: చంద్రబాబు

  • నంద్యాలలో అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుని మరణించడం విచారకరం. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు అనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనం. (1/4) pic.twitter.com/rh8zb1n2UZ

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చేయని నేరాన్ని అంగీకరించాలంటూ వేధించడంతో నంద్యాలలో నిండు కుటుంబం బలైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. వైకాపా పాలనలో ముస్లింలపై వేధింపులు, అక్రమ కేసులు పెరిగాయని ఆరోపించారు. రాజమహేంద్రవరంలోనూ నిందితులకు అండగా నిలిచారని మండిపడ్డారు. కేసు వెనక్కి తీసుకోవాలని ముస్లిం బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా నేతల తీరుతో బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటున్న ప్రభుత్వం... దీనికి ఏమని సమాధానం చెప్తుంది? నంద్యాల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ

Last Updated : Nov 8, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.