Mining at ravvalakonda: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన కర్నూలు జిల్లాలోని రవ్వలకొండ గుహలో వైకాపా నేతల మైనింగ్‌పై.. న్యాయ పోరాటం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ నేతలు మంగళగిరి తెదేపా కార్యాలయంలో చంద్రబాబును కలిసి రవ్వలకొండ మైనింగ్ అంశాన్ని వివరించారు.
జిల్లాలోని బనగానపల్లి మండలం రవ్వలకొండ గుహలో.. 450 ఏళ్ల క్రితం 12 ఏళ్లపాటు తపస్సు చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారని చెప్పారు. అలాంటి పవిత్రమైన రవ్వలకొండను వైకాపా అక్రమ మాఫియా ఇస్టానుసారం తవ్వేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:
'సారా మరణాలపై అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెప్పారు'