'అభివృద్ధి పనులే తెదేపాని గెలిపిస్తాయి' - స్థానిక సంస్ఖల ఎన్నికల వార్తలు
తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే వల్లే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీనేత కేఈ. ప్రతాప్ ధీమా వక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా డోన్‌లో తెదేపా కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వైకాపా అధికారం చేపట్టి 9 నెలలు అయిన ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. గ్రామాలలో ఓట్లు ఆడిగేటప్పుడు వైకాపా వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఈ ఎన్నికలలో తెదేపాను గెలుపించాలని కార్యకర్తలకు సూచించారు.