కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిల ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, భాజపా యువనేత గంగుల భరత్ సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగువ అహోబిలం నుంచి వరాహ నరసింహస్వామి ఆలయం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని అహోబిల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేస్తామని భాజపా నేత భరత సింహారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: