కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో సబ్సిడీపై ఉల్లి పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. మార్కెట్లో కొరత వల్ల సబ్సిడీ కేంద్రాల వద్ద అధికారులు నో స్టాక్ బోర్డు పెట్టారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో వంద రూపాయలు పలుకుతోంది. ప్రభుత్వం కిలో రూ.25కే ఇస్తున్న కారణంగా... ప్రజలు ఆయా కేంద్రాలకు తరలివస్తున్నారు. నో స్టాక్ బోర్డు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై ఉల్లి పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: