కర్నూలు జిల్లా నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మండలంలో ఇటీవల ఓ పాఠశాల బస్సు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదైనా పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. వెంటనే వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి: ఎస్సై జీపు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు