ETV Bharat / state

STUDENT DEAD: గుంతలు తీసి మరిచారు..బాలుడి ప్రాణాలు తీశారు

author img

By

Published : Sep 11, 2021, 5:31 PM IST

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. పూడ్చకుండా ఉంచిన గుంటలో పడి విద్యార్థి మృతి చెందాడు.

గుంటలో పడి విద్యార్థి మృతి
గుంటలో పడి విద్యార్థి మృతి

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా డోన్​లో చోటు చేసుకుంది. డోన్ పట్టణంలోని వైయస్​నగర్​లో గత 15 రోజులుగా.. గాజులదిన్నె తాగునీటి పైప్ లైన్ లీకేజీ అవుతోంది. దీంతో అధికారులు గుంత తీసి మరమ్మతులు చేపట్టారు. అయినప్పటికీ నీరు లీకేజీ అవుతూనే ఉంది. ఆ గుంత లోతుగా ఉండడంతో నీరు నిల్వ ఉంది.

పని పూర్తి కాలేదని గుంతను పుడ్చకుండా వదిలేశారు. అయితే జంగాల కాలనీకి చెందిన దంపతులు హరిబాబు, హరితల కుమారుడు మల్లికార్జున్ (9) అడుకుంటూ గుంతలో పడిపోయాడు. మల్లికార్జున్​తో పాటు వెళ్లిన మరో పిల్లాడు చూసి అక్కడుకున్న వారికి సమాచారం అందించారు. స్థానికులు బాలుడిని బయటకు తీసి డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

ఇదీ చదవండి:

బాషా కుటుంబం సెల్ఫీ వీడియో: వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.