కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరి నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి లక్షా 35 వేల 890 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోందని అధికారులు వెల్లడించారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... 42 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నామని తెలిపారు.
శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 870.20 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 143.30 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం ఇదే విధంగా భారీగా కొనసాగితే... వారం రోజుల్లో జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అధికారులు అంచనా వేశారు.
ఇదీ చూడండి: