శ్రీశైలం దేవస్థానం టికెట్ల కుంభకోణం కేసులో రెగ్యులర్ ఉద్యోగులపై వేటుపడింది. పర్యవేక్షకుడితో పాటు ఇద్దరు శాశ్వత ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు. నిధుల గోల్‌మాల్‌పై కొందరు అధికారుల నుంచి వివరణ కోరిన ఈవో.. బ్యాంకు తరఫున పనిచేసే సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో శాశ్వత ఉద్యోగులకు టికెట్ల జారీ బాధ్యతలు అప్పగించారు. టికెట్ల జారీకి ఇకపై ఎస్ఐఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు బదులు టీఎంఎస్ వినియోగిస్తామని ఈవో స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..