ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి శ్రీమల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్లు దేవస్థానం ఈవో కేఎస్. రామారావు తెలిపారు. గర్భాలయంలో అభిషేకాలను ఏడు విడతలుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సామూహిక అభిషేకాలను నాలుగు విడతలుగా జరుపనున్నట్లు తెలిపారు.
భ్రమరాంబ దేవికి అంతరాలయంలో ఆర్జిత కుంకుమార్చనలను భక్తులు నిర్వహించుకోవచ్చన్నారు. బ్రేక్ దర్శనాలను మూడు విడతలుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వేద ఆశీర్వచనం నవావరణార్చన లను భక్తులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అన్ని ఆర్జిత సేవల టిక్కెట్లను భక్తులు ఆన్లైన్ ద్వారా పొందవచ్చన్నారు.
ఇదీ చదవండి: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ ఓం బిర్లా