శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. జలాశయంలోని నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు తాగు, సాగు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా..,ప్రస్తుత జలాశయం నీటిమట్టం 828.80 అడుగులు, నీటి నిల్వ 48 టీఎంసీలుగా ఉంది.
ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ..14,778 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో మరో 19 టీఎంసీల నీటిని మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడానికి అవకాశం ఉంది. జలాశయ నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరుకోగానే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. ఇప్పటి వరకు 1,113 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. మరొకొన్ని రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 2019-20వార్షిక సంవత్సరంలో 1300 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత ఏడాది లక్ష్యాన్ని ప్రస్తుతం అధిగమించే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇదీచదవండి