ETV Bharat / state

రాయలసీమ... బంగారు సీమ - రాయలసీమలో బంగారు నిక్షేపాలపై కథనం

రతనాల సీమ రాయలసీమ కాస్తా ముందు ముందు బంగారు సీమగా మారే రోజులు రానున్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, జీ. ఎర్రగుడి ప్రాంతాల్లోని భూమి పొరల్లో పుత్తడి దాగుంది. జియో మైసూర్‌ సంస్థ ఇప్పటికే తూర్పు బ్లాకులో డ్రిల్లింగ్‌ చేసి (రంధ్రాలు వేసి) పసిడి నిక్షేపాలపై ఒక అంచనాకు వచ్చింది. ఇటీవల దక్షిణ బ్లాక్‌లో అన్వేషణ ప్రారంభించారు.

special article on gold hunting in rayalaseema
రాయలసీమ... బంగారు సీమ
author img

By

Published : Oct 18, 2020, 4:12 PM IST

Updated : Oct 18, 2020, 7:08 PM IST

రాయలసీమ... బంగారు సీమ

కేజీఎఫ్‌(కర్ణాటక గోల్డ్‌ ఫీల్డ్‌) బంగారు తవ్వకాల గని. ఇకపై కర్నూలు గోల్డ్‌ ఫీల్డ్స్‌(కేజీఎఫ్‌) అదే తరహా ముద్ర వేసుకోనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, జీ. ఎర్రగుడి ప్రాంతాల్లోని భూమి పొరల్లో పుత్తడి దాగుంది. రతనాల సీమ రాయలసీమ నానుడి కాస్తా బంగారు సీమగా మారే రోజులు ముందున్నాయి. జియో మైసూర్‌ సంస్థ ఇప్పటికే తూర్పు బ్లాకులో డ్రిల్లింగ్‌ చేసి (రంధ్రాలు వేసి) పసిడి నిక్షేపాలపై ఒక అంచనాకు వచ్చింది. ఇటీవల దక్షిణ బ్లాక్‌లో అన్వేషణ ప్రారంభించారు.

భూమి పొరల్లో రాయిని పొడి చేస్తే బంగారం తీయడం కష్టమవుతుంది కనుక... రోటరీ డ్రిల్లింగ్‌ చేస్తూ (రాయిని కత్తిరిస్తూ) లోపల ఎంత లోతులో బంగారం ఉందో గుర్తిస్తున్నారు. ఒక మీటరు లోతులో వెలికి తీసిన ఖనిజ నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటారు. ఇప్పటికే తూర్పు బ్లాక్‌లో ఇలా 30 వేల మీటర్లు రోటరీ డ్రిల్లింగ్‌ ద్వారా నమూనాలు సేకరించి ఉంచారు. శుద్ధి కర్మాగారం, హంద్రీ నుంచి 18 కి.మీ. పైపులైను పనులు పూర్తిచేయడానికి మరో 15 నెలలు పట్టేలా ఉందని, ఇవి పూర్తయితే 2022 నుంచి తూర్పు బ్లాక్‌లో బంగారం ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సీఈవో హనుమప్రసాద్‌ తెలిపారు.

టన్ను ముడి ఖనిజంలో 1.6 గ్రాములు

తుగ్గలి పరిధిలోని భూముల్లో బంగారు ఖనిజ నిక్షేపాలున్నట్లు భారత భూగర్భ పరిశోధనా సంస్థ(జీఎస్‌ఐ), మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గతంలోనే నిర్ధరించాయి. 2013లో తవ్వకాలకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులు దక్కించుకున్న జియో మైసూర్‌ సర్వీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఆస్ట్రేలియా, లండన్‌, భారతదేశానికి చెందిన నలుగురు షేర్‌ హోల్డర్లు(భాగస్వామ్యం)గా ఉన్నారు. ఏడాదికి 750 కేజీల బంగారం వెలికి తీసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఒక టన్ను ముడి ఖనిజంలో 1.6 గ్రాముల బంగారం వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

2018-19కి కౌలు చెల్లించడానికి..

బంగారం అన్వేషణ సమయంలో వచ్చే దుమ్ముతో పొలాలు దెబ్బతింటున్న క్రమంలో 1500 ఎకరాలకు 2017-18లో ఎకరాకు రూ.15 వేలు చొప్పున రైతులకు జియో మైసూర్‌ సంస్థ కౌలు చెల్లించింది. 2018-19 సంవత్సరానికి కౌలు పెంచుతూ ఎకరాకు రూ.16,500 చెల్లించేందుకు సంస్థ ప్రతినిధులు నిర్ణయించారు. త్వరలో కౌలు చెల్లిస్తామని చెబుతున్నారు. పరిశ్రమ, ఇతర ఏర్పాట్లకు 350 ఎకరాలను సంస్థ కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. దీనికోసం ఎకరాకు రైతులకు రూ.12 లక్షలు చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. కేవలం 60 ఎకరాల్లోనే బంగారు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్‌ వేస్తారు.

ఆనాడే గుర్తించిన ఆంగ్లేయులు

జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల సరిహద్దున ఉన్న ‘దొన’ ప్రాంతానికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని మైనింగ్‌ ప్రధాన కేంద్రంగా సంస్థ గుర్తించింది. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఇక్కడ బంగారు ఖనిజం వెలికితీయగా ఏర్పడిన పెద్ద గోతినే ఇప్పుడు ‘దొన’ అంటున్నారు. అప్పట్లోనే బంగారు గనులున్నట్లు బ్రిటీష్‌వారు గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. బంగారు గనుల తవ్వకాలతో 300 మంది స్థానిక యువతకు ఉపాధి కలగనుంది. పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

ఇవీ చదవండి..

కనకదుర్గ పైవంతెనపై తప్పని ట్రాఫిక్‌ కష్టాలు

Last Updated : Oct 18, 2020, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.