రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలులోని తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... వైకాపా సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే వైకాపా ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకుంటే అధికారులు చిక్కుల్లో పడతారని సోమిశెట్టి హెచ్చరించారు. పార్టీలు మారతాయి కానీ అధికారులు కాదంటూ వ్యాఖ్యానించారు. వైకాపా దుశ్చర్యలకు ఎదురుతిరుగుతున్న తెదేపా నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా గురించి బయట మాట్లాడుతున్నారు కానీ పార్లమెంట్లో నోరుమెదపడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: