వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని..తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసులు, అధికారులు, వైకాపా నాయకులు తెదేపా బలపరిచిన అభ్యర్థులను బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గమైన ఆలూరు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్‌లో తెదేపా మద్దతుదారులు విజయం సాధించారని గుర్తు చేశారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీచదవండి
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా