కర్నూలు జిల్లా నంద్యాలలో మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నివాసముంటున్న ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన మట్టి మిద్దె కూలింది. దీంతో ముల్లా రెహ్మెత్ భీ(54) అనే మహిళ మృతి చెందింది. ఇబ్రహీం అనే వ్యక్తితో పాటు, వారి కూతురు షభానాకు గాయాలయ్యాయి. మట్టి మిద్దె శిథిలం కావడం.. వానలకు నాని కూలింది.
ఇదీ చదవండి శ్రీశైలానికి వరద ప్రవాహం...849 అడుగులకు నీటిమట్టం