కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ, అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గజవాహన సేవ, రాత్రి రావణ వాహన సేవ, 11వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా.. ఉదయం సింహ వాహన సేవ, రాత్రి నంది వాహన సేవలు జరిపించనున్నారు. వాటితోపాటుగా రాత్రి పది గంటలకు లింగోద్భవ కాల మహా రుద్రాభిషేకం జరిపించి అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 12న ఉదయం మయూర వాహన సేవ, రాత్రి పుష్ప పల్లకి సేవ.. 13న వ్యాఘ్ర వాహన సేవ, మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి పుష్ప శయనోత్సవాలు జరిపిస్తారు. చివరోజైన 14వ తేదీన మహా పూర్ణాహుతి, నాగబలి పూజ, త్రిశుల స్నానం, ధ్వజ అవరోహణం వైభవంగా నిర్వహించి.. రాత్రి తెప్పోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు.
ఇవీ చూడండి... కర్నూలు జగన్నాథగట్టు వద్ద న్యాయ రాజధాని: మంత్రి బుగ్గన