కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం పాత గోశాలలో నాగుపాము భక్తుల్లో భయాందోళనలను సృష్టించింది. రాతి దూలాల్లో వేలాడుతున్న పామును చూసి, వినాయక నంది ఆలయ పూజారి బాబుస్వామి ..పాములను పట్టుకునే వారికి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పాములు పట్టుకునే వారు దాన్ని బందించి పూజారి చేతికి ఇచ్చాడు. సరదాపడిన ఆ పూజారి ఆ పాముతో ఓ సెల్పీ తీసుకున్నాడు. అనంతరం దాన్ని స్థానికంగా ఉన్న అడవిలోకి వదిలారు. ఈ తతంగాన్నంతా చూస్తున్న భక్తులు మాత్రం, ఆలయంలో సంచరిస్తున్న పాములపై ఆందోళన వ్యక్తం చేశారు. పాములు సంచారం ఉన్న చోట విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని దేవస్థానం సిబ్బంది తెలిపారు.
ఇది చూడండి: ఘనంగా శ్రీ రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు