కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీమొత్తంలో నగదు పట్టుకున్నారు. తమిళనాడు వాసి నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా.. హైదరాబాద్ నుంచి మధురై వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన సతీష్ బాలకృష్ణన్ వద్ద రూ. 75 లక్షలు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసిన సెబ్ అధికారులు.. ఆ మొత్తం నగదును స్వాదీనం చేసుకున్నారు. అయితే.. స్థలం కొనుగోలు చేసేందుకు నగదు తీసుకెళ్తున్నట్లు సతీశ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద బస్సు బోల్తా.. పలువురు మృతి