సచివాలయ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొదటి రోజు పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ -V), మహిళా పోలీసు, వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఈరోజు జిల్లావ్యాప్తంగా 34,367 మంది అభ్యర్థుల కోసం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నియమాల ప్రకారం కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి..