Sliver Seized at Panchalingala Check post: కర్నూలు సరిహద్దు పంచలింగాల అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద అధికారులు భారీగా వెండిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న కారును అధికారులు తనిఖీ చేయగా 167 కేజీల వెండి ఆభరణాలు గుర్తించారు. వాటిని అనధికారికంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన వెండి ఆభరణాల విలువ సుమారు కోటి 20 లక్షలు ఉన్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు. బెంగళూరుకు చెందిన అభిషేకం అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తుండగా పోలీసులు పట్టకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి : Salaries For Teachers : ముందుగా ఉపాధ్యాయుల వేతనాలు...