ETV Bharat / state

లారీని ఢీకొట్టిన కారు... ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం - నంద్యాల టోల్​ప్లాజా వద్ద ప్రమాదం

కర్నూలు జిల్లా నంద్యాల టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగి ఎస్‌బీఐ ఉద్యోగి శివకుమార్‌ సజీవదహనమయ్యాడు. మరో ముగ్గురు వ్యక్తులు కారు నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

sbi employee died in road accident at karnool
నంద్యాలలో ప్రమాదం
author img

By

Published : Jul 29, 2020, 9:52 AM IST

Updated : Jul 29, 2020, 11:56 AM IST

కారులో మంటలు చెలరేగి ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనమయ్యారు. ఈ ఘటన తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగింది. ఎస్‌బీఐ ఉద్యోగి శివకుమార్‌ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు కారులో బయలుదేరారు. కర్నూలు జిల్లాలోని నంద్యాల సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టింది.

దీంతో కారు కంటైనర్‌లో ఇరుక్కుపోయింది. ప్రమాదాన్ని కంటైనర్‌ డ్రైవర్‌ గమనించకపోవడంతో కారును సుమారు 8కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా వద్ద కారులో మంటలు చెలరేగాయి. శివకుమార్‌(40) దివ్యాంగుడు కావడంతో కారులో నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యాడు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శివకుమార్‌ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం, కాగా నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు.

నంద్యాలలో ప్రమాదం

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్త వాహనాలకు త్వరలో అమలు

Last Updated : Jul 29, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.