కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి బైఠాయించారు. పెండింగులో ఉన్న జీతాలు ఇవ్వని కారణంగా.. ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలు పెంచి తమను ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇది వరకే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం నెలనెలా జీతాల మంజూరుపై అయినా దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు. గుత్తేదారు దృష్టికి ఈ విషయాన్ని ఇప్పటికే తీసుకెళ్లినట్లు ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: