ఎనిమిది నెలలుగా కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయిన కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరుడు శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 839 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయ ప్రహరీ, ముఖద్వారం, ప్రాంగణంలోని దేవతామూర్తులు వెలుగుచూశాయి. అడుగుమేర నీటిలో వేపదారు శివలింగం ఉండిపోగా నీటిమట్టం 838 అడుగులకు చేరాక పూర్తి దర్శన భాగ్యం లభించనుంది. గత ఏడాది జులై 19న కృష్ణా నది నీటిలోకి ఆలయం ఒదిగిపోగా 8 నెలల తర్వాత దర్శన భాగ్యం లభించింది. పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: తల్లి ప్రోత్సాహం... కోచ్ తోడ్పాటు... బ్యాడ్మింటన్లో రాణింపు