కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ ఆదేశాలతో... జిల్లాలో 126 బస్సులు వివిధ రూట్లలో సర్వీసులు నడుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు తిరుగుతాయి.
జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, బేతంచర్ల, రుద్రవరం, కోడుమూరు, గూడూరు, ఆత్మకూరు, డోన్ తదితర ప్రాంతాలకు 632 ట్రిప్పులు తిరగనున్నాయి. ఇతర జిల్లాలైన అనంతపురం, కడపలకు 6 బస్సులు నడుపుతున్నారు.
భౌతిక దూరం సహా శానిటైజర్, మాస్కులు వినియోగించటం తప్పనిసరి. టిక్కెట్ల కోసం బస్టాండ్లలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బస్సుల్లో 50 శాతం సీట్లను తొలగించారు.
ఇదీ చూడండి: