ETV Bharat / state

బిచ్చగాడి ఒంటిపై 12 చొక్కాలు....విప్పిచూస్తే! - డోన్ పట్టణం తాజా వార్తలు

రోడ్డు పక్కన దీనావస్థలో ఉన్న బిచ్చగాడికి సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తులు.... అతని వద్ద ఉన్న నగదు చూసి ఆశ్చర్యపోయారు. ఒంటిపై 12 చొక్కాలు వేసుకున్న బిచ్చగాడు...వాటి లోపల నగదును దాచిపెట్టాడు.

బిచ్చగాడి ఒంటిపై 12 చొక్కాలు....విప్పిచూస్తే!

author img

By

Published : Jun 1, 2020, 7:28 PM IST

Updated : Jun 1, 2020, 8:11 PM IST

బిచ్చగాడి వద్ద రెండు లక్షల రూపాయలు

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఓ యాచకుడు 2 లక్షల రూపాయలు పోగుచేశాడు. అతనికి సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఈ డబ్బును గుర్తించారు. తెలంగాణలోని మహబూబ్​నగర్​కు చెందిన శ్రీను అనే వ్యక్తి... కొన్ని సంవత్సరాల క్రితం డోన్​కు వచ్చాడు. పట్టణంలో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగించేవాడు. బేతంచెర్ల సర్కిల్​లోని మసీదు వద్ద దీన స్థితిలో ఉన్న శ్రీనును చూసి స్థానికులు ద్రోణాచలం సేవా సమితి ప్రతినిధులకు తెలియజేశారు.

సేవా సమితి సభ్యులు అక్కడికి చేరుకొని శ్రీనుకు స్నానం చేయించేందుకు ప్రయత్నించారు. అతను మొత్తం 12 చొక్కాలు వేసుకున్నాడని గమనించి వారు ఆశ్చర్యపోయారు. చొక్కాలను విప్పే క్రమంలో ఒక కవర్​లో భారీగా నగదును గుర్తించారు. అందులో మొత్తం 2 లక్షలు రూపాయలు ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం సేవా సమితి వారు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

'శ్రీను అనే యాచకుడి దగ్గర రెండు లక్షలు రూపాయలు పైగా బయటపడ్డాయి. వాటిలో 77,500 రూపాయల విలువైన పాత నోట్లు, 1,26,959 రూపాయల విలువైన కొత్త నోట్లు ఉన్నాయి' అని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. అతనిని వారి కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చి... నగదును వారికి అందిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ రమేశ్​ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

Last Updated : Jun 1, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.