కర్నూలు నగరంలో వరుసగా పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. బుధవారం నగరంలోని రోజా వీధిలోని మెకానిక్‌గా పని చేస్తున్న షరీఫ్ ఇంట్లో చోరీ జరిగింది. 10 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండి, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ఇంటికి తాళం వేసుకొని పనికి వెళ్లగా… చోరీ జరిగిందని పోలీసులు వెల్లడించారు. కర్నూలు డీఎస్పీ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాల సేకరించారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: క్వారంటైన్ కేంద్రంలో సమస్యలు... కొవిడ్ బాధితుల ఆందోళన