కర్నూలు జిల్లా గడివేముల మండలంలో జరిగిన భూ అక్రమాలపై ఈనాడు - ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. కరోనా వేళ గుట్టుచప్పుడు కాకుండా... మండలంలోని 230 ఎకరాల వాగు పోరంబోకు భూమిని అసైన్డ్‌గా మార్చి పాసుపుస్తకాలు సృష్టించి ఇతరులకు కట్టబెట్టేశారు. వాటిని ఆన్లైన్లో ఎక్కించారు.
ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ కథనాలు వెలువడ్డాయి. ఆగస్టు 12న ఈటీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన కలెక్టర్ వీరపాండియన్... గడివేముల తహశీల్దారు ఇంద్రాణి, గని గ్రామ వీఆర్వో ఈశ్వర్ రెడ్డి, కొరటమద్ది వీఆర్ఏ బాలచంద్రుడు, తహశీల్దారు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పార్వతిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: