కర్నూలులో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో.... కలెక్టర్ వీరపాండియన్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా మైదానంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాగిలాల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.
నందికొట్కూరు నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని వక్తలు మాట్లాడుతూ... స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలాలను గుర్తుచేసుకున్నారు.
తెదేపా కార్యాలయంలో వేడుకలు..
రాష్ట్రంలో రాజ్యాంగబద్దంగా పరిపాలన సాగడంలేదని కర్నూలులో తెదేపా నాయకులు అన్నారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గణత్రంత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికలను ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని... ఉద్యోగులు కాదని వెంకటేశ్వర్లు అన్నారు.
ఇదీ చూడండి: స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలి: బాలకృష్ణ