శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల నుంచి 37,936 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 865.10 అడుగులు ఉంది.జలాశయం ప్రస్తుత నీటినిల్వ 122.7178 టీఎంసీలుగా ఉంది. ఇప్పటికే జలాశయానికి 57,440 క్యూసెక్కులు నీరు చేరింది.ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 40,259 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు.శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 1,688 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 10,617 క్యూసెక్కులు విడుదల చేశారు.
ఇవీ చదవండి