కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటగిరికి చెందిన ఉరుకుందు రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. డబ్బులు మీద ఆశతో దొంగదారిలో సంపాదిద్దాం అనుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటుందని.. అందులో లక్ష రూపాయలు కడితే నెలకు రూ. 5 వేలు వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. తన ఊర్లోని బంధువులు, స్నేహితులతో దాదాపు రూ. 36 లక్షల వరకు వసూలు చేశాడు.
మొదట్లో సక్రమంగానే వడ్డీ చెల్లించాడు. గత కొన్ని నెలలుగా వడ్డీలు ఇవ్వకపోవటంతో గ్రామస్థులు అతన్ని నిలదీశారు. పథకం ఏమీ లేదని తాను ఇప్పుడు డబ్బులు కట్టలేనంటూ చేతులెత్తేశాడు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు రైల్వే ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...
కూల్‌డ్రింక్‌లో చీమల మందు కలుపుకొని తాగిన చిన్నారులు..బాలుడు మృతి