Pregnant womens struggle: కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో స్కానింగ్ పరీక్షల కోసం గర్భిణులు బారులు తీరారు. ఈ రోజు స్కానింగ్ కోసం దాదాపు 350 మంది ఆస్పతికి రాగా... కుర్చీలు లేకపోవటంతో గర్భిణులు నేలపై కూర్చున్నారు. స్కానింగ్ కోసం చాలా సమయం పడుతుందని క్యూలైన్లోనే భోజనాలు చేయాల్సి వస్తోందని గర్భిణులు చెబుతున్నారు.
ప్రతి నెలా 9న నెలలు నిండిన గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. స్కానింగ్ కోసం అధిక సంఖ్యలో గర్భిణులు వస్తారని తెలిసి కూడా తగిన వసతులు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
హెలికాప్టర్ క్రాష్: పార్థివదేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం!