కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్‌ఫోన్ లైట్ల మధ్య రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. ఉక్కపోత భరించలేక... దోమల బాధ తట్టుకోలేక రోగులతో పాటు సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని బాధితుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక సమస్య తలెత్తటంతో రాత్రి నుంచి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు వెంటనే స్పందించి.. సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు