ETV Bharat / state

POLLUTION EFFECT ON VILLAGES: కాలుష్యం కోరల్లో ప్రజలు.. విషవాయువులతో ఇబ్బందులు - కర్నూలు జిల్లాలో కాలుష్యం కోరలు

POLLUATION: పచ్చని ఆ పల్లెల్లో ఓ రసాయన పరిశ్రమ విషాన్ని విరజిమ్ముతోంది. తమ ప్రాంతానికి పరిశ్రమ వస్తే ఉపాధి దొరుకుందని ఆనందపడిన ప్రజలకు.. రకరకాల రోగాలను తెచ్చిపెడుతోంది. చివరికి పశువులు తాగే నీరు కూడా కలుషితమవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా డోన్‌ మండల గ్రామాల ప్రజలపై ప్రత్యేక కథనం.

కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ప్రజలు
కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ప్రజలు
author img

By

Published : Feb 1, 2022, 12:08 PM IST

కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ప్రజలు

POLLUATION: కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపంలోని ఓ రసాయన పరిశ్రమతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రమైతే చాలు విషవాయువులు ఆ పల్లెలను కమ్మేస్తున్నాయి. ఘాటైన వాసనలు పీల్చి అనారోగ్యం బారిన పడుతున్నారు. కాలుష్యం కోరలు చాస్తుండటంతో పీల్చే గాలి, తాగే నీరు విషతుల్యమవుతోంది.

గ్రామాలపై విషవాయువుల ప్రభావం..

డోన్ పరిధిలోని ఉడుములపాడు, అబ్బిరెడ్డిపల్లి గ్రామాలపై విషవాయువులు తీవ్ర ప్రభావం చూపుతోంది. జగదుర్తి, కర్లకుంట, అమకతాడు గ్రామాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే నీటిని వర్షాకాలంలో వాగులోకి వదులుతున్నారు. మిగిలిన సమయంలో బోరు వేసి అందులోకి పంపిస్తున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా జగదుర్తి చెరువులోకి వాగు నీరు చేరడంతో నీరంతా కలుషితమై పశువులు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.

రాత్రివేళ వదులుతున్న విషవాయువులతో ఘాటైన దుర్వాసన వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఉదయం 10 గంటల వరకు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఆయాసం, కళ్లు తిరగటం లక్షణాలతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నామని వాపోతున్నారు. కొందరు కిడ్నీల సమస్యతో మంచం పడుతున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయక ముందు బిస్కెట్, దాణా తయారీ చేసే ఫ్యాక్టరీ అని చెప్పారని, ఇప్పుడు రసాయనాలు వదులుతూ రోగాల బారిన పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

పరిశ్రమకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పరిస్థితే ఇలా ఉంటే.. పరిశ్రమ పక్కనే కొత్తగా జగనన్న కాలనీలు కేటాయించారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల అక్కడ ఉండేవారికి ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని అంటన్నారు.

ఇదీ చదవండి:

అప్పుల బాధ తాళలేక!... చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.