కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో వెంకటేశ్వర పురం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆటోలో తెలంగాణకు చెందిన 71 మద్యం సీసాలను తరలిస్తూ పోలీసులకు దొరికాడు. అతనిని అరెస్ట్ చేసి... ఆటో, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ దివాకర రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి. వాడపల్లిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం