ETV Bharat / state

liquor seize: కర్నూలులో పక్క రాష్ట్రం మద్యం పట్టివేత.. - కర్నూలు జిల్లా వార్తలు

కారులో అక్రమంగా తరలిస్తున్న పక్క రాష్ట్రం మద్యాన్ని (karnataka liquor) కర్నూలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 30 బాక్సుల్లో 2,880 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పార్థసారధి తెలిపారు.

కర్నూలు జిల్లాలో 3 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం పట్టివేత

author img

By

Published : Oct 9, 2021, 3:36 PM IST

పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని.. కర్నూలు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఆథోని మండలం పెద్దహరివణం వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. అక్రమంగా మద్యం తరలిస్తున్న కారు ఎదురైంది. ఆ కారు తనిఖీ చేయగా.. అందులో రూ. 3 లక్షల విలువైన మద్యం పట్టుబడింది.

ఈ మద్యం ఎక్కడి నుంచి తరలిస్తున్నారని ఆరాతీయగా.. కర్ణాటక రాష్ట్రం నుంచి తరలిస్తున్నట్టుగా తేలింది. మద్యంతోపాటు కారును సీజ్ చేసిన పోలీసులు.. డ్రైవర్​ను అరెస్టు చేశారు. మొత్తం 30 బాక్సుల్లో 2,880 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పార్థసారధి వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ఇదీ చదవండి:
పేదలందరికీ ఇళ్ల పథకం..హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తాం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.