ETV Bharat / state

డబ్బులు కోసం సారా విక్రయం.. తరలించేందుకు బైక్​ల చోరీ...! - Latest information on bike thefts in Adoni

చదువు అట్టకెక్కింది. స్నేహితులందరూ జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలను బానిసలయ్యారు. వాటి కోసం డబ్బు అవసరం అయ్యింది.. ఇందు కోసం మద్యం అక్రమంగా తరలించి విక్రయించాలని ప్లాన్​ వేశారు. అందుకోసం బైక్​లు కావాలి.. వాటి కోసం మరో ప్లాన్​ వేశారు..ద్విచక్రవాహనాలు చోరీ చేయడం మొదలు పెట్టారు.. పథకం ప్రకారం కొన్ని ద్విచక్రవాహనాలను దొంగిలించారు. కానీ అంతలోపే...

Bike thieves
బైక్ దొంగలు
author img

By

Published : Jul 27, 2021, 5:29 PM IST

బైక్ దొంగలు

చెడు వ్యసనాలకు బానిసలై అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ ఘటన జరిగింది. నిందితుల నుంచి 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో రాత్రి పూట రోడ్డు మీద తిరుగుతూ.. బైక్​లను చోరీ చేస్తున్నారు. ఈ వాహనాలను.. కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తేవడానికి వాడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరిని ఆర్టీవో కార్యాలయం వద్ద అదుపులో తీసుకున్నామని డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. పట్టుబడిన వారంతా యువతేనని.. చెడు వ్యసనాలకు బానిసలై జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. మినీట్రక్కుల పంపిణీ ఉత్తర్వుల్లో మార్పులు.. 90 శాతం మేర రాయితీ నేరుగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.