కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తున్న క్రమంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ తమ లగేజీని చుపించారు. ఓ ప్రయాణికుడు పోలీసులను చూసి పారిపోయాడు. అతని బ్యాగులో పోలీసులు గంజాయిని గుర్తించారు. పరారైన వ్యక్తి హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో బస్సు ఎక్కినట్లు డ్రైవర్ చెప్పాడు. బ్యాగ్‌లోని 17 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
ఇదీ చదవండి: పొన్నెకల్లులో నాటు సారా పట్టివేత