ETV Bharat / state

TRAVELLING IN PUTTI: ప్రయాణంలో ‘పుట్టి’డు కష్టాలు..! - కర్నూలు ప్రజల ప్రయాణ సమస్యలు

కర్నూలు జిల్లా ప్రజలు బళ్లారికి వెళ్లాలన్నా.. బళ్లారి ప్రజలు కర్నూలు రావాలన్నా వేదవతి నది దాటి రావాలి. లేదా రహదారి గుండా 50కి.మీలు ప్రయాణించాలి. ఇలా రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రమాదకరమైనప్పటికీ.. వేదవతి నదీ గుండానే పుట్టిలోనే ప్రయాణిస్తున్నారు.

people-traveling-dangerously-in-putti-at-kurnool-district
ప్రయాణంలో ‘పుట్టి’డు కష్టాలు..!
author img

By

Published : Nov 3, 2021, 7:36 AM IST

కర్నూలు జిల్లా హాలహర్వి మండల పరిధిలోని గూళ్యం గ్రామం మీదుగా వేదవతి నది ప్రవహిస్తోంది. నది దాటితే కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి తదితర ప్రాంతాలకు వెళ్లొచ్చు. రహదారి మీదుగా బళ్లారికి వెళ్లాలంటే 50 కి.మీలు ప్రయాణించాలి. నదిలో కిలోమీటరు ప్రయాణించి అవతలి గట్టుకు చేరితే బళ్లారి వెళ్లేందుకు దాదాపు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వ్యయ ప్రయాసలూ తగ్గుతాయి. దీంతో గూళ్యం, సిద్ధాపురం, జె.హొస్సళ్లి, అమృతాపురం గ్రామాల ప్రజలు ఇలా పుట్టిని ఆశ్రయించి ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.

ప్రతి గురువారం గూళ్యంలోని గాదిలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక నుంచీ భక్తులు అధిక సంఖ్యలో పుట్టిలో ప్రయాణించి వస్తుంటారు. రెండు రాష్ట్రాల నాయకులూ ఈ సమస్యపై దృష్టి పెట్టి నదిపై త్వరగా వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

CM Jagan: ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.