కర్నూలు జిల్లా కౌతాళం మండల ఉరుకుంద గ్రామంలో 25 మంది కలుషిత నీరుతాగి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు అయ్యాయి. కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందంటూ గ్రామస్థులు వాపోయారు. బాధితులు ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది అనారోగ్యం పాలయ్యారని... గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి