పింఛన్లు పునరుద్ధరించాలని లబ్ధిదారుల ఆందోళన - people protest for pensions in kurnool
పింఛన్ల తొలగింపుపై కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట పింఛనుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము పెన్షన్ తీసుకుంటున్నామని.. ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పకుండా పెన్షన్ తొలగించారని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పుకు తాము బలయ్యామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతున్నారు.